రోడ్‌మ్యాప్‌ ఎప్పుడిస్తారు?

ABN , First Publish Date - 2022-03-16T08:48:27+05:30 IST

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్‌ చేసిన ప్రసంగంపై వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. శాసనమండలి వాయిదా పడిన తర్వాత

రోడ్‌మ్యాప్‌ ఎప్పుడిస్తారు?

ముందు మీరు రోడ్లు వేయండి.. వైసీపీ, బీజేపీ సభ్యుల చలోక్తులు 


అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్‌ చేసిన ప్రసంగంపై వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. శాసనమండలి వాయిదా పడిన తర్వాత హాల్లోనే కొందరు మంత్రులు, ఎమ్మెల్సీలు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస్‌, సీదిరి అప్పలరాజు, పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎమ్మెల్యే అంబటిపై పవన్‌ వ్యాఖ్యల గురించి వెల్లంపల్లి, అవంతి చర్చించారు. వెలంపల్లి వైపు చూపిస్తూ మనోడే ముందు... అంటూ మంత్రి కన్నబాబు జోక్‌ చేశారు. ఈ చర్చ జరుగుతున్నప్పుడే బీజేపీఎమ్మెల్సీలు మాధవ్‌, వాకాటి నారాయణరెడ్డి అక్కడికి వచ్చారు. రోడ్‌మ్యాప్‌ ఎప్పుడు ఇస్తున్నారు? అంటూ వారిని వైసీపీ సభ్యులు సరదాగా అడిగారు. ‘‘ముందు మీరు రోడ్లు వేయండి. రోడ్లు సరిగా లేకుండా రోడ్‌మ్యాప్‌ ఏం ఇస్తాం’’ అంటూ వాకాటి చమత్కరించారు. కాగా, వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ శాసనమండలిలో ఆయన స్థానం వద్దకు వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

Read more