ప్రత్యేక హోదా మరిచారా?: యనమల

ABN , First Publish Date - 2022-08-17T22:24:23+05:30 IST

ప్రత్యేక హోదా మరిచారా?: యనమల

ప్రత్యేక హోదా మరిచారా?: యనమల

అమరావతి: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్ పాలనతో యువతకు ఉపాధి కలగా మిగిలిపోయిందని చెప్పారు. ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలను జగన్ విస్మరించారని చెప్పారు. ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ హామీలు ఏమయ్యాయి? అని ఆయన ప్రశ్నించారు. జగన్‌కు సీఎం హోదా వచ్చాక.. ప్రత్యేక హోదా మరిచారా? అని ప్రశ్నించారు. 

Updated Date - 2022-08-17T22:24:23+05:30 IST