వివేకాందనరెడ్డి హత్య నేరపూరిత కుట్ర: యనమల

ABN , First Publish Date - 2022-03-05T18:24:15+05:30 IST

వివేకాందనరెడ్డి హత్య నేరపూరిత కుట్ర అని.. దీనిలో జగన్ రెడ్డి ప్రధాన భాగస్వామి అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

వివేకాందనరెడ్డి హత్య నేరపూరిత కుట్ర: యనమల

అమరావతి : వివేకాందనరెడ్డి హత్య నేరపూరిత కుట్ర అని.. దీనిలో జగన్ రెడ్డి ప్రధాన భాగస్వామి అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వివేకా హత్య కేసులో సీబీఐ అవినాశ్ రెడ్డితో పాటు జగన్ రెడ్డి పేరు కూడా ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్‌లో చేర్చాలన్నారు. రాజధానిపై మరో చట్టం తీసుకురావటానికి వీల్లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందన్నారు. ఇంకా యనమల మాట్లాడుతూ.. ‘‘శాసన సభ రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేయాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాదు.  సజ్జల రామకృష్టారెడ్డి మాట్లాడుతూ చట్టసభల్లో తమకు బలముందని అంటున్నారు. ఆయన చెప్పేది నిజమే. వారికి అధికార బలం, అహంకార మదం ఉంది తప్ప ఆలోచన బలం లేదు. అభివృద్ది వికేంద్రీకరణకు అర్థం కూడా తెలియకుండా అభివృద్ది వికేంద్రీకరణ గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం. అభివృద్ది వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదు. బడ్జెట్‌ను అన్ని ప్రాంతాలకు సమానంగా పంచి రాష్ట్రం అంతా అభివృద్ది చేయాలి’’ అని పేర్కొన్నారు.

Read more