కాలిగ్రఫీలో స్టేట్‌ చాంపియన్‌గా సంహిత

ABN , First Publish Date - 2022-10-12T08:56:14+05:30 IST

ప్రపంచ కాలిగ్రఫీ హ్యాండ్‌ రైటింగ్‌ దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో స్టేట్‌ చాంపియన్‌గా కాకికాడ జిల్లా కాకినాడ

కాలిగ్రఫీలో స్టేట్‌ చాంపియన్‌గా సంహిత

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 11: ప్రపంచ కాలిగ్రఫీ హ్యాండ్‌ రైటింగ్‌ దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో స్టేట్‌ చాంపియన్‌గా కాకికాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం వైద్యనగర్‌కు చెందిన ఇంటర్మీడియెట్‌ విద్యార్థిని కురసాల సిరికృష్ణ సంహిత నిలిచింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన హ్యాండ్‌ రైటింగ్‌ ట్రైనర్స్‌ అసోసియేషన్‌ అండ్‌ కాలిగ్రఫీ అకాడమీ ఆధ్వర్యాన ఆగస్టు 14న ఆన్‌లైన్‌లో ఈ పోటీ నిర్వహించగా మొత్తం 42 వేలమంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఉత్తమ చేతిరాత గల పదిమందిని ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సంహిత కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కుమార్తె కావడం విశేషం. 

Read more