వైసీపీ ఎంపీలకు ఎందుకు ఆసక్తి?

ABN , First Publish Date - 2022-08-04T07:37:53+05:30 IST

వైసీపీ ఎంపీలకు ఎందుకు ఆసక్తి?

వైసీపీ ఎంపీలకు ఎందుకు ఆసక్తి?

బీచ్‌ శాండ్‌ మైనింగ్‌ గురించి వైసీపీ ఎంపీలు ఇంత ఆసక్తి ప్రదర్శించడం ఇది రెండోసారి. బీచ్‌ శాండ్‌ ఖనిజవనరుల మైనింగ్‌ అనుమతి కోరుతూ ఏపీ చేసిన అభ్యర్థనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుందా అని గతంలో ఒకసారి ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి అదే ప్రశ్న వేయడమే కాకుండా... మిగతా 15 ప్రాంతాల్లో ఏపీఎండీసీని ఎందుకు లీజుదారుగా నియమించలేదని కూడా ప్రశ్నించారు గతంలో వైసీపీకి చెందిన ఎంపీలు గోరంట్ల మాధవ్‌, ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించగా, ఇప్పుడు కోటగిరి శ్రీధర్‌, సంజీవ్‌కుమార్‌ల ద్వారా జగన్‌ ప్రభుత్వం దీనిపై ప్రశ్నలు వేయించింది.   బీచ్‌శాండ్‌ విషయంలో జగన్‌ ప్రభుత్వం తరఫున పీఎంవో నుంచి సమాచారం లాగేందుకు వారు ఈ ప్రశ్నలు పదే పదే వేసినట్లు స్పష్టమవుతోంది. కానీ అనూహ్యంగా వారికి చెంపపెట్టు అయ్యేలా కేంద్రం స్పందించింది. 

Updated Date - 2022-08-04T07:37:53+05:30 IST