‘ఎట్‌ హోం’లో ఎవరికి వారే..

ABN , First Publish Date - 2022-08-16T08:42:29+05:30 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్‌ హోం కార్యక్రమంలో సీఎం జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబు కనీసం పలకరించుకోలేదు.

‘ఎట్‌ హోం’లో ఎవరికి వారే..

  • మాట్లాడుకోని సీఎం, ప్రతిపక్షనేత
  • అందరినీ పలకరించిన గవర్నర్‌

అమరావతి. ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్‌ హోం కార్యక్రమంలో సీఎం జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబు కనీసం పలకరించుకోలేదు. అస లు ఒకరికొకరు ఎదురెదురుగా వచ్చిన దృశ్య మే లేదు. సాధారణంగా రాజ్‌భవన్‌లో జరిగే ఎట్‌ హోం కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీల వారిని గవర్నర్‌ ఆహ్వానిస్తారు. కార్యక్రమంలో సీఎం, ప్రతిపక్ష నేత కలుసుకుని కాసేపు ముచ్చటించుకుంటారు. కానీ, ఈసా రి అందుకు భిన్నంగా జరిగింది. సోమవారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్‌ హోం కార్యక్రమంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు, సీఎం జగన్‌ దంపతులు ప్రధా న వేదిక వద్ద కూర్చున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ ప్రజాప్రతినిధులు కాస్త దూరంగా కూర్చున్నారు. సీఎం జగన్‌.. చంద్రబాబు కూర్చున్న బెంచ్‌ వద్దకు వచ్చే ప్రయత్నమే చేయలేదు. ఎడ మొహం, పెడ మొహంగానే వ్యవహరించారు. కార్యక్రమం అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయా రు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా దంపతులు, పలురువు హైకోర్టు న్యాయమూర్తులు, మం త్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు పలువురు, ప్రభుత్వాధికారులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్‌ దంపతులు సాయంత్రం 5.20 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుని, నేరుగా గవర్నర్‌ ఇంటికి వెళ్లారు. జాతీయ గీతాలాపన అనంతరం గవర్నర్‌ ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి పేరుపేరున పలకరించారు.

Read more