-
-
Home » Andhra Pradesh » When is engineering counselling-NGTS-AndhraPradesh
-
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఎప్పుడు?
ABN , First Publish Date - 2022-09-08T09:21:25+05:30 IST
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఎప్పుడు?

తొలుత సప్లిమెంటరీ కోసం వాయిదా.. ఫలితాలొచ్చినా రాని షెడ్యూలు
అమరావతి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఎప్పుడనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. తొలుత ఇచ్చిన షెడ్యూలును మార్చి న సాంకేతిక విద్యాశాఖ సవరణ షెడ్యూలు విడుదల చేయలేదు. ప్రభుత్వం నుంచి కాలేజీలు, సీట్ల వివరాల కు సంబంధించిన జీవో విడుదల కాకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. తొలుత విడుదల చేసిన షెడ్యూలులో ఆగస్టు 30 వరకు రిజిస్ర్టేషన్‌కు గడువు ఇచ్చారు. అయితే, ఈ ఏడాది ఇంటర్మీడియట్‌లో ఎక్కు వ మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో సప్లిమెంటరీ పరీక్షల కోసం వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను వాయిదా వేశారు. రిజిస్ర్టేషన్ల గడువును ఈ నెల 5 వరకు పొడిగించారు. ఆగస్టు 30న సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. వీటిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కూడా ఇంజనీరింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది. పొడిగించిన రిజిస్ర్టేషన్ గడువు ముగిసినా ఇప్పటికీ సవరణ షెడ్యూలుపై స్పష్టత లేకుండా పోయింది. కళాశాలల్లోని సీట్లపై జీవో ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా అఫిలియేషన్ల పునరుద్ధరణ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఈ జీవో రాలేదు. దీంతో కౌన్సెలింగ్‌లో జాప్యం ఏర్పడింది. ఏపీలో షెడ్యూలు ప్రకారం కౌన్సెలింగ్ జరిగి ఉంటే మంగళవారమే సీట్ల కేటాయింపు పూర్తై ఉండేది.