-
-
Home » Andhra Pradesh » welcome high court judgment on amravati nadendla-MRGS-AndhraPradesh
-
అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: నాదెండ్ల
ABN , First Publish Date - 2022-03-05T23:58:28+05:30 IST
అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అమరావతి: అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని రైతులు అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. రైతులు, మహిళలపై ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. అన్ని రోజులు ఒకేలా ఉండవని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. సీఎం జగన్ వల్లే ఏపీ అప్పులపాలైందని విమర్శించారు. మూడు రాజధానులు అనేది జగన్ ఆడే డ్రామా అని మనోహర్ తప్పుబట్టారు.