కాకినాడలో పెళ్లి బస్సు బోల్తా... ఒకరు మృతి
ABN , First Publish Date - 2022-05-20T15:38:11+05:30 IST
జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావు పేట సమీపంలో జాతీయ రహదారిపై పెళ్లి బస్సు బోల్తా పడింది.

కాకినాడ: జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట సమీపంలో జాతీయ రహదారిపై పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... పెళ్లి కొడుకు సహా 36మంది గాయపడ్డారు. బస్సు విజయనగరం నుంచి ఏలూరుకు వరుడితో మార్గంమధ్యలో గండేపల్లి నీలాద్రి రావు పేట పెట్రోల్ బంక్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఒకరిపై ఒకరు పడడంతో పెళ్లి కొడుక్కి వరుసకు పెదనాన్న అయిన గుడిపాటి వెంకట కోదండరామయ్య అనే వ్యక్తి ఊపిరి ఆడకపోవడంతో బస్సులోనే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.