AP News: రౌడీ రాజకీయాలను ఇక సహించం: నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

ABN , First Publish Date - 2022-10-18T23:12:15+05:30 IST

పీలేరు: రౌడీ రాజకీయాలను ఇకపై సహించేది లేదని, ఎంతటివారినైనా ఢీ కొంటామని టీడీపీ పీలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామ సర్పంచ్ మహితపై దాడి ఘటన ఆటవిక చర్యగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం రాజ్యమేలు

AP News: రౌడీ రాజకీయాలను ఇక సహించం: నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

పీలేరు: రౌడీ రాజకీయాలను ఇకపై సహించేది లేదని, ఎంతటివారినైనా ఢీ కొంటామని టీడీపీ పీలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామ సర్పంచ్ మహితపై దాడి ఘటన ఆటవిక చర్యగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందన్నారు. ఇకపై తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి‌చేస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ల్యాండ్, సాండ్, మైన్-వైన్ వైసీపీ పాలసీగా మారిపోవడం మన  దౌర్భాగ్యమన్నారు. మూడు రాజధానులు ముద్దు.. అంటూ  పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించడం సిగ్గుచేటన్నారు. మొన్నటి దాకా మదనపల్లి జిల్లా వద్దు.. రాయచోటి ముద్దు అన్న ఎమ్మెల్యే చింతల ప్రస్తుతం మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెట్టడం సమంజసం కాదన్నారు. తిరుపతి రాజధాని చెయ్యాలని ఒక్క ఎమ్మెల్యే కూడా అడగకపోవడం అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల చేతకానితనానికి నిదర్శనమన్నారు. విలేఖరుల కార్యక్రమంలో సర్పంచ్ మహిత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కంభం నిరంజన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T23:12:15+05:30 IST