ఇలా అయితే ఓటడగలేం.. వైసీపీ కౌన్సిలర్ల ఆవేదన

ABN , First Publish Date - 2022-12-31T05:37:04+05:30 IST

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్‌ సమావేశంలో అధికార పార్టీ వైసీపీ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు.

ఇలా అయితే ఓటడగలేం.. వైసీపీ కౌన్సిలర్ల ఆవేదన

సూళ్లూరుపేట, డిసెంబరు 30: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్‌ సమావేశంలో అధికార పార్టీ వైసీపీ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. ‘‘ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారా? ఉదయం లేచినప్పటి నుంచి వార్డుల్లోకి వెళ్లాలంటే భయమేస్తోంది. మాకు ఏం చేశారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొందరు తిట్టిపోస్తున్నారు. ఇలాగైతే రేపు ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకు ఎలా వెళ్లాలి’’ అంటూ ఆవేదన వెళ్లగక్కారు. ‘‘వార్డులో గుంతలు తవ్వి వదిలేశారు. అధికారులు ఎప్పుడు అడిగినా బిజీగా ఉన్నామని సమాధానం చెబుతారు. ఇలాగైతే మేమెందుకు’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2022-12-31T05:37:17+05:30 IST

Read more