ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో 31 వేల అన ర్హుల ఓట్లు కట్‌!

ABN , First Publish Date - 2022-12-31T03:29:40+05:30 IST

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఐదు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో 31వేల మంది ఓటర్లను తొలగించింది. వీరిలో డబుల్‌

ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో 31 వేల అన ర్హుల ఓట్లు కట్‌!

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అత్యధికంగా 11,758

కడప, అనంత, కర్నూలు ఉపాధ్యాయ స్థానంలో అత్యల్పంగా 608 రద్దు

కొత్తగా చేరిన ఓటర్లు 1,08,624.. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో 10,51,074 ఓట్లు

తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన సీఈవో మీనా

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఐదు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో 31వేల మంది ఓటర్లను తొలగించింది. వీరిలో డబుల్‌ ఎంట్రీతోపాటు అనర్హులు ఉన్నారు. ఈ ఓట్లు తొలగించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా శుక్రవారం ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాలో 9,42,450 మంది ఓటర్లు ఉండగా, తుది జాబితాలో 10,51,074కు చేరారు. అంటే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల తర్వాత కొత్తగా 1,08,624 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి అనర్హులను అత్యధికంగా(ప్రకాశం, నెల్లూరు చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం) 11,758 మందిని, అత్యల్పంగా(కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం) 608మందిని తొలగించారు. 31,949 వేల డూప్లికేట్‌ ఓటర్లు(ఒకే వ్యక్తి పేరు ఎక్కువసార్లు రావడం), ఫేక్‌ సర్టిఫికెట్లతో నమోదైన ఓటర్లు, విద్యార్హత లేని అనర్హులు, టీచర్లు కాకుండానే ఉపాధ్యాయ ఓటర్లుగా నమోదైనవారు, నాన్‌టీచింగ్‌ సిబ్బంది, ఫోర్జరీ సంతకాలు చేసిన వారిని జాబితా నుంచి తొలగించారు.

తాజాగా విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో కొత్తగా 10,51,074 మంది ఓటర్లు నమోదయ్యారు. ముసాయిదా ఓటర్ల జాబితా కంటే.. తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 1,08,624కి పెరిగింది.

Updated Date - 2022-12-31T03:29:42+05:30 IST