వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి పిటీషన్‌పై సుప్రీం వాయిదా..
ABN , First Publish Date - 2022-11-21T13:19:16+05:30 IST
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది.
ఢిల్లీ : వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka murder case)లో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి (Erra Gangireddy) బెయిల్ పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టు (Supreme Court)లో వాయిదా పడింది. వివేకా హత్య కేసును వేరే రాష్ట్రానికి తరలించాలంటూ సునీతారెడ్డి దాఖలు చేసిన కేసులో తీర్పు రిజర్వ్ అయిందన్న విషయాన్ని న్యాయవాది నటరాజన్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. న్యాయమూర్తి ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది.