YV. Subbareddy: కళలను ప్రోత్సహించడానికే జగనన్న స్వర్ణోత్సవాలు

ABN , First Publish Date - 2022-12-14T12:30:42+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళలన్నింటినీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వైసీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరినా

YV. Subbareddy: కళలను ప్రోత్సహించడానికే జగనన్న స్వర్ణోత్సవాలు
కళలను ప్రోత్సహించడానికే

విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళలన్నింటినీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వైసీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరినా థియేటర్‌లో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ.సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, విడదల రజిని, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్...

జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతున్నాయని వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటికే తిరుపతి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రిలో స్వర్ణోత్సవ సంబరాలు పూర్తయ్యాయని చెప్పారు. మన సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిభింభించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. విశాఖ ఎంతో ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతం.. విశాఖను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేశారు.

మంత్రి విడదల రజిని కామెంట్స్..

రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు పండుగల జరుగుతున్నాయని మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంత్రి రోజాకి అభినందనలు చెప్పారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్..

విశాఖలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు జరగడం సంతోషంగా ఉందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా కళలను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. మన సాంస్కృతి సాంప్రదాయాలను అందరం కాపాడుకోవాలని మంత్రి సూచించారు.

Updated Date - 2022-12-14T12:52:33+05:30 IST