AP News: ఆటోనగర్ అన్నాక్యాంటీన్ సమీపంలో పేలుడు
ABN , First Publish Date - 2022-08-18T15:54:51+05:30 IST
విశాఖ గాజువాక ఆటోనగర్ అన్నాక్యాంటీన్ సమీపంలో పేలుడు సంభవించింది.
విశాఖపట్నం: విశాఖ గాజువాక ఆటోనగర్ అన్నాక్యాంటీన్ (Anna canteen) సమీపంలో పేలుడు సంభవించింది. గురువారం తెల్లవారుజామున పాన్‌షాపులో పేలుడుతో ప్రహరీగోడ ధ్వంసమైంది. పేలుడు ధాటికి షాపు పైకప్పు ఎగిరి పడింది. గ్యాస్ పేలుడు సంభవించినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు అక్కడకు చేరుకుని ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.