విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్‌షిప్
ABN , First Publish Date - 2022-08-04T08:20:34+05:30 IST
విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్‌షిప్
‘సేల్స్‌ఫోర్స్’తో ‘ఉన్నత విద్య’ ఒప్పందం
అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్‌షి్‌పను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ కె. హేమచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే లక్షన్నర మంది కి ఇంటర్న్‌షిప్ అందించేలా ఎడ్యుస్కిల్స్‌తో ఒప్పందం చేసుకున్న ఉన్నత విద్యామండలి.. మరో 30వేల మం దికి ఇంటర్న్‌షిప్ ఇచ్చేలా బుధవారం సేల్స్‌ఫోర్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా వర్చువల్ విధానంలో ఇంటర్న్‌షిప్ చేయవచ్చన్నారు. ఈ ఇంటర్న్‌షి్‌పలకు సర్టిఫికెట్లు లభిస్తాయని, దాంతో విద్యార్థులు సులభంగా ఉద్యోగాలు సాధించవచ్చని చెప్పారు.