ప.గో. జిల్లాలో వైసీపీ నేతల దౌర్జన్యం

ABN , First Publish Date - 2022-03-05T20:32:48+05:30 IST

అధికార బలంతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పెదవేగి మండలం పెదకడిమిలో వైసీపీ నేతల దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్రమ మట్టి తవ్వకాలను గనుల శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం అడ్డుకున్నారు.

ప.గో. జిల్లాలో వైసీపీ నేతల దౌర్జన్యం

ఏలూరు: అధికార బలంతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పెదవేగి మండలం పెదకడిమిలో వైసీపీ నేతల దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్రమ మట్టి తవ్వకాలను గనుల శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం అడ్డుకున్నారు. సుబ్రహ్మణ్యం దగ్గర ఉన్న పత్రాలను వైసీపీ నేతలు చించివేశారు. వైసీపీ నేతలపై పెదవేగి పీఎస్‌లో ఏడీ సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. ముగ్గురు వైసీపీ నేతలపై ఐపీసీ 353 సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు మాఫీ చేయడానికి వైసీపీ పెద్దల రంగంలోకి దిగారు. అయితే కేసుపై అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం పెదవి విప్పలేదు.

Read more