-
-
Home » Andhra Pradesh » vijayawada SEB officials who destroyed huge quantities of cannabis-MRGS-AndhraPradesh
-
APNews: 20లక్షలు విలువ చేసే గంజాయి ధ్వంసం
ABN , First Publish Date - 2022-07-05T19:51:47+05:30 IST
కృష్ణా జిల్లాలో 20 లక్షలు విలువ చేసే గంజాయిని ఎస్ఈబీ అధికారులు ధ్వంసం చేశారు.

విజయవాడ: కృష్ణా జిల్లాలో 20 లక్షలు విలువ చేసే గంజాయిని ఎస్ఈబీ (SEB) అధికారులు ధ్వంసం చేశారు. గత మూడు నెలలలో పట్టుకున్న గంజాయికి నిప్పంటించి కాల్చిబూడిద చేశారు. ఈస్ట్, వెస్ట్, కృష్ణా జిల్లాల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 770 కేజీల గంజాయిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. పలు ప్రదేశాల్లో పట్టుకున్న గంజాయిని మొత్తాన్ని గుట్టగా పోసి పోలీస్ అధికారుల సమక్షంలో నిప్పంటించారు. గన్నవరం మండలం గొలనపల్లి శివారులో కొండ ప్రాంతంలో గంజాయిని కాల్చి బూడిద చేశారు.