Vijayawadaలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-05-24T16:40:05+05:30 IST

విజయవాడ రూరల్ మండలం నిడమానూరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Vijayawadaలో ఘోర రోడ్డు ప్రమాదం

ఎన్టీఆర్: విజయవాడ రూరల్ మండలం నిడమానూరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్లే రహదారిపై బైపాస్‌లో ఆగి ఉన్న మినీ ఐసర్ లారీని వెనక నుండి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పలాసకు చెందిన పి.హరీష్(29) ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. డ్యూటీకి సెలవు దొరకడంతో హైదరాబాద్‌లో ఉంటున్న తన చెల్లెలిని చూడటానికి పలాస నుండి కారులో బయలు దేరి... దారిలో హుండీ గ్రామానికి చెందిన గౌరి రాజు అనే ప్యాసంజ‌ర్‌ను కారులో ఎక్కించుకొన్నాడు. ఈ తెల్లవారు జామున నిడమానురు బైపాస్ దగ్గరకు ఆగివున్న మినీ లారీని కారు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణం నిద్రమత్తు, అతి వేగం కారణమని పోలీసులు భాస్తున్నారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Read more