-
-
Home » Andhra Pradesh » vijayawada kanakadurgamma temple andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
durgamma temple: రేపే మూలానక్షత్రం.. ఇంద్రకీలాద్రిపై అధికారుల అలర్ట్
ABN , First Publish Date - 2022-10-01T18:14:08+05:30 IST
ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాలు (Devi navaratri celebrations) ఘనంగా జరుగుతున్నాయి. రేపు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో దేవస్ధాన, రెవిన్యూ, పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చే అమ్మవారిని చూడడానికి లక్షల సంఖ్యలో ఇంద్రకీలాద్రికి భక్తులు రానున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో దుర్గమ్మను మూడులక్షల మంది భక్తులు దర్శించుకోనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని క్యూలైన్లను ఉచితంగా ప్రకటించారు. పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. వీఐపీలకు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం ఇవ్వలేమని ఇప్పటికే మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. రేపు వీఐపీలు ఇంద్రకీలాద్రికి వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. రేపటికి ఐదు లక్షల లడ్డూలను అధికారులు సిద్ధంగా ఉంచనున్నారు.