Durgamma temple: భవానీల మాల విరమణపై కొనసాగుతున్న గందరగోళం

ABN , First Publish Date - 2022-10-03T16:50:25+05:30 IST

ఇంద్రకీలాద్రిపై భవానీల మాల విరమణపై గందరగోళం కొనసాగుతోంది.

Durgamma temple: భవానీల మాల విరమణపై కొనసాగుతున్న గందరగోళం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై భవానీల మాల విరమణపై గందరగోళం కొనసాగుతోంది. భవానీల మాల విరమణకు దేవస్థానం అధికారులు ఎటువంటి ఏర్పాట్ల చేయలేదు. దీంతో మాల విరమణ ఎక్కడ చేయాలన్న దానిపై భవానీలు తర్జనభర్జన పడుతున్నారు. ప్రతి ఏడాది మల్లికార్జున మండపం పక్కనే గల ఖాళీ స్థానం హోమ గుండం, మాల విరమణకి ఏర్పాట్లు జరిగేవి. కాగా... ఈరోజు సాయంత్రం నుంచి భారీ సంఖ్యలో భవానీలు తరలివచ్చే అవకాశం ఉంది. మూడు రోజులు పాటు భవానీల తాకిడి ఉండే అవకాశం ఉందని  గురు భవానీలు చెబుతున్నారు. ఈ ఏడాది మాల విరమణకు దేవస్థానం అధికారులు ఎటువంటి ఏర్పాటు చేయకపోవడంపై... గురు భవానీల హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాదికి ఎటువంటి ఏర్పాటు చేయలేమని దుర్గగుడి దేవస్థానం అధికారులు చేతులెత్తేశారు. అధికారుల తీరుపై భవానీలు మండిపడుతున్నారు. 

Read more