మైండ్ గేమ్ రాజకీయాలకు బీజేపీ చెక్ పెడుతుంది: Somuveerraju

ABN , First Publish Date - 2022-01-12T17:21:49+05:30 IST

బీజేపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు.

మైండ్ గేమ్ రాజకీయాలకు బీజేపీ చెక్ పెడుతుంది: Somuveerraju

విజయవాడ: బీజేపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. రాఘవయ్య పార్క్ వద్ద వివేకానంద విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పూలమాలలు వేసిన నివాళి అర్పించారు. అనంతరం సోమువీర్రాజు మాట్లాడుతూ ‘‘మా మిత్ర పక్షం నాయకులు నిన్న కార్యకర్తల సమావేశంలో మైండ్ గేమ్ రాజకీయాలు ఏపీలో నడుస్తున్నాయని ప్రస్తావించారు. అటువంటి మైండ్ గేమ్ రాజకీయాలకు బీజేపీ చెక్ పెడుతుంది’’ అని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది మోదీనే అని అన్నారు. ఏపీని అభివృద్ధి చేయటానికి బీజేపీ, జనసేనలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని సోమువీర్రాజు పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-12T17:21:49+05:30 IST