అన్నమాటమీద నిలబడి అందర్నీ పీకేయండి: వర్ల రామయ్య ట్వీట్

ABN , First Publish Date - 2022-04-10T17:55:36+05:30 IST

టీడీపీ నేత వర్ల రామయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

అన్నమాటమీద నిలబడి అందర్నీ పీకేయండి: వర్ల రామయ్య ట్వీట్

అమరావతి: తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి గారూ.. నోరు లేని మా దళిత హోం మంత్రి సుచరిత గారిని తొలగించి, క్రొత్త మంత్రి మండలిలో నోరు తప్ప ఏమీలేని బూతుల మంత్రి కొడాలి నానీని కొనసాగించాలని చూడడం మంచిది కాదేమో, ఒక్కసారి ఆలోచించండి.. అన్న మాటమీద నిలబడి అందర్నీ పీకేయండి సార్.. మాట తప్పకండి, మడం కూడ తిప్పకండి.. ఎవరి సలహాలు వినకండి..’’ అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

Updated Date - 2022-04-10T17:55:36+05:30 IST