పద్మవ్యూహంలో జగన్: వర్లరామయ్య

ABN , First Publish Date - 2022-04-10T02:50:16+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ పేరుతో పద్మవ్యూహంలో పడిపోయారని తెలుగుదేశం నేత వర్లరామయ్య అన్నారు.

పద్మవ్యూహంలో జగన్: వర్లరామయ్య

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ పేరుతో పద్మవ్యూహంలో  పడిపోయారని తెలుగుదేశం నేత వర్లరామయ్య అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కేబినెట్‌లో కీలకమైన ఆరుగురు మంత్రుల్లో ఏ ఒక్కరిని తొలగించినా.. సీఎం పదవికి ముప్పు తప్పదన్నారు. మంత్రివర్గ ప్రక్షాళన పేరుతో తేనె తుట్టెను కదిలించారని చెప్పారు. పెద్దిరెడ్డి, బొత్స, ధర్మాన, సురేష్, బాలినేని, బూతుల మంత్రిని..తొలగించే సాహసం చేయలేరని వ్యాఖ్యానించారు. జగన్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారిందని వర్లరామయ్య దెప్పిపొడిశారు. 

Updated Date - 2022-04-10T02:50:16+05:30 IST