7 నుంచి ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర: సోము

ABN , First Publish Date - 2022-04-05T09:33:25+05:30 IST

ఉత్తరాంధ్రాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఈ నెల ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు ‘ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర’ నిర్వహించనున్నట్టు..

7 నుంచి ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర: సోము

విశాఖపట్నం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఈ నెల ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు ‘ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర’ నిర్వహించనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఈ నెల 7వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో ప్రధాన ప్రాజెక్టులను సందర్శించి, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తామన్నారు. రాష్ట్రంలో అనేక పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే...వాటితో జగన్‌ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. త్వరలో అన్ని జగనన్న కాలనీల్లో  ‘మోదీ అన్న కాలనీలు’ అంటూ ఫ్లెక్సీలు పెడతామన్నారు. 

Read more