కడపలో 471 టీచర్‌ పోస్టుల అప్‌గ్రేడ్‌

ABN , First Publish Date - 2022-10-07T08:53:39+05:30 IST

కడపలో 471 టీచర్‌ పోస్టుల అప్‌గ్రేడ్‌

కడపలో 471 టీచర్‌ పోస్టుల అప్‌గ్రేడ్‌

అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో 471 ఎస్జీటీ, పీఈటీ పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. మరో 104 సబ్జెక్టు టీచర్‌ పోస్టులను ఇతర సబ్జెక్టులకు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఒక ప్రీ హైస్కూల్‌ను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేసింది. కన్వెర్షన్‌ చేసిన సబ్జెక్టు టీచర్‌ పోస్టుల్లో ఎక్కువగా ఇంగ్లిష్‌ సబ్జెక్టులోకి మార్చారు. కన్వెర్షన్‌, అప్‌గ్రేడేషన్‌పై ఇప్పటికే గత నెలలో మార్గదర్శకాలు జారీచేయగా, తదనుగుణంగా ఇప్పుడు చర్యలు చేపట్టింది.


Updated Date - 2022-10-07T08:53:39+05:30 IST