వైకుంఠ మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-08-04T07:57:57+05:30 IST

వైకుంఠ మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి అంత్యక్రియలు

వైకుంఠ మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి అంత్యక్రియలు

రాయదుర్గం/హైదరాబాద్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి(57) అంత్యక్రియలు గచ్చిబౌలిలోని వైకుంఠ మహాప్రస్థానంలో బుధవారం ఉదయం 11 గంటలకు జరిగాయి. ఆమె చితికి భర్త శ్రీనివా్‌సప్రసాద్‌ నిప్పంటించారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు, నారా లోకేష్‌, సినీహీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన సోదరుడు రామకృష్ణ, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, కుటుంబ సభ్యులు, బంధువులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని అంతిమ వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులతో పాటు ఎన్టీఆర్‌ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T07:57:57+05:30 IST