పోలీ్‌సస్టేషన్‌ ఎదుట బైక్‌లపై తిరిగారని ఇద్దరు టీడీపీ కార్యకర్తల అరెస్టు

ABN , First Publish Date - 2022-12-15T03:38:03+05:30 IST

పోలీ్‌సస్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైక్‌లపై తిరిగారని ఇద్దరు టీడీపీ కార్యకర్తలను వెల్దుర్తి పోలీసులు అరెస్టు చేయడంతో బుధవారం ఉద్రిక్తత నెలకొంది.

పోలీ్‌సస్టేషన్‌ ఎదుట బైక్‌లపై తిరిగారని  ఇద్దరు టీడీపీ కార్యకర్తల అరెస్టు

ప్రశ్నించిన కుటుంబసభ్యులను హేళన చేసిన పోలీసులు

వెల్దుర్తి స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టిన బ్రహ్మారెడ్డి

వెల్దుర్తి, డిసెంబరు 14: పోలీ్‌సస్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైక్‌లపై తిరిగారని ఇద్దరు టీడీపీ కార్యకర్తలను వెల్దుర్తి పోలీసులు అరెస్టు చేయడంతో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన రాయనూతల కిషోర్‌ ఇంట్లో ఓ శుభకార్యానికి టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి రాక సందర్భంగా ఆయనకు ఆహ్వానం పలికే క్రమం లో చాగంటి ఏసోబు, మాచర్ల చంద్రయ్య ద్విచక్ర వాహనాలపై తిరుగుతుండగా పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. దీంతో ఏసోబు తల్లి ఆరోగ్యమ్మ, భార్య మనోరమ స్టేషన్‌కు చేరుకుని వారిని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తూ.. అక్కడే బైఠాయించారు. మనోరమ్మ సొమ్మసిల్లి పడిపోగా విషయం తెలుసుకున్న బ్రహ్మారెడ్డి పార్టీ నేతలతో పోలీ్‌సస్టేషన్‌ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తల అరెస్టుపై బ్రహ్మారెడ్డి ప్రశ్నించగా పదేపదే ద్విచక్ర వాహనాలతో స్టేషన్‌ ముందు సంచరిస్తుండడంతో అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. కాలనీకి వెళ్లాలంటే స్టేషన్‌ ముందు నుంచే వెళ్లాల్సి ఉంది. అంతమాత్రానికే అరెస్టు చేసి కొడతారా అంటూ ఆయన మండిపడ్డారు. మొదట ద్విచక్ర వాహనాలతో శబ్ధాలు చేసినందుకు కేసులు పెట్టామన్న పోలీసులు.. తర్వాత డ్రంకెన్‌ డ్రైవ్‌ అని చెబుతున్నారన్నారు. అరెస్టును ప్రశ్నించిన మహిళలను మగాళ్లు లేరా అంటూ పోలీసులు హేళనగా మాట్లాడడం సిగ్గు చేటన్నారు. న్యాయం కోసం మగాళ్లే కావాలా.. మహిళలు పనికిరారా అని బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మాచర్ల రూరల్‌ సీఐ సమివుల్లాఖాన్‌ అక్కడకు చేరుకుని కార్యకర్తలందరినీ పంపించివేయాలని బ్రహ్మారెడ్డిని కోరారు. ఘటనపై విచారణ జరుపుతామన్న హామీతో కార్యకర్తలు వెనుదిరిగారు.

Updated Date - 2022-12-15T03:38:05+05:30 IST