రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు దగ్ధం

ABN , First Publish Date - 2022-12-12T02:04:50+05:30 IST

రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో అవి నిలువునా కాలిపోయాయి. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గుమ్మయ్యగారిపల్లి సమీపాన హిందూపురం రహదారిలో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు దగ్ధం

గోరంట్ల, డిసెంబరు 11: రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో అవి నిలువునా కాలిపోయాయి. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గుమ్మయ్యగారిపల్లి సమీపాన హిందూపురం రహదారిలో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. తిమ్మిగానిపల్లికి చెందిన ఒకే కుటుంబానికి ఏడుగురు తిరుమల వెళ్లి వస్తున్న ఇన్నోవా వాహనం... హైదరాబాద్‌ నుంచి గోరంట్లలో వివాహానికి వెళ్తున్న ముగ్గురు ప్రయాణిస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో తిమ్మిగానిపల్లికి చెందిన చౌడమ్మ, నాగరాజు, సురేష్‌, సుకన్య, భానుతేజ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు చిన్నారులు, డ్రైవర్‌ కృష్ణారెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. గోరంట్లకు వెళ్తున్న కారులోని బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మోహన్‌, హైదరాబాద్‌కు చెందిన మృణాల్‌ గాయపడ్డారు. ఆ కారులోని మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కార్లలో మంటలు చెలరేగాయి. పెనుకొండ, పుట్టపర్తి నుంచి వచ్చిన అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశారు. అప్పటికే రెండు కార్లు పూర్తిగా కాలిపోయాయి.

Updated Date - 2022-12-12T02:04:50+05:30 IST

Read more