Tungabhadra Dam 31 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-07-18T14:58:12+05:30 IST

తుంగభద్ర డ్యామ్(Tungabhadra Dam)కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్టులోకి వచ్చి

Tungabhadra Dam 31 గేట్లు ఎత్తివేత

Kurnool: తుంగభద్ర డ్యామ్(Tungabhadra Dam)కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్టులోకి వచ్చి నీరు చేరుతుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు తుంగభద్ర డ్యామ్ 31 గేట్లు ఎత్తి నీరును దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో(Project inflow) 1,64,978 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో(Out flow) 1,55,474 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం 1630.73 అడుగులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 105 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ 96.83 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2022-07-18T14:58:12+05:30 IST