నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటు

ABN , First Publish Date - 2022-10-17T10:23:34+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానానికి నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటైంది. ఐదుగురు సభ్యులతో ఆగమ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ టీటీడీ

నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటు

తిరుమల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానానికి నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటైంది. ఐదుగురు సభ్యులతో ఆగమ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ టీటీడీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మండలిలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు ఎ.వేణుగోపాల దీక్షితులు, ఆలయ అర్చకుడు ఎ.రామకృష్ణ దీక్షితులు, ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం వైఖానస ఆగమపండితుడు ఎన్వీ మెహనరంగాచార్యులు, మాజీ వైఖానస ఆగమపండితుడు పి.సీతారామాచార్యులు, ఎస్వీ వేదిక్‌ యూనివర్సిటీ మాజీ గెస్ట్‌ ఫ్రొఫెసర్‌ వేదాంతం గోపాల కృష్ణామాచార్యులను రెండేళ్ల కాలపరిమితితో నియమిస్తూ మూడ్రోజుల కిందట టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం ఆలయ కైంకర్యాలు, ముఖ్యమైన కార్యక్రమాల్లో తమ సలహాలను అందజేస్తుంది.

Updated Date - 2022-10-17T10:23:34+05:30 IST