-
-
Home » Andhra Pradesh » ttd tirumala devotees bbr-MRGS-AndhraPradesh
-
TTD: శ్రీవారి దర్శనానికి 22 గంటలు
ABN , First Publish Date - 2022-09-18T02:56:26+05:30 IST
పెరటాసి నెల శనివారం నుంచి మొదలు కావడంతో తిరుమల (Tirumala)లో రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తిరుమల కొండకు భక్తుల

తిరుమల: పెరటాసి నెల శనివారం నుంచి మొదలు కావడంతో తిరుమల (Tirumala)లో రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తిరుమల కొండకు భక్తుల (Devotees) రాక పెరిగింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అన్నప్రసాద భవనం, లడ్డూకౌంటర్, అఖిలాండం, బస్టాండ్, వైకుంఠం క్యూకాంప్లెక్స్ వంటి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ పెరిగిన నేపథ్యంలో గదులకు డిమాండ్ పెరిగింది. గదుల కేటాయింపు కేంద్రాల వద్ద భక్తులు బారులు తీరారు. తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు కూడా కిటకిటలాడాయి. మరోవైపు సర్వదర్శన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయాయి. ఎస్ఎంసీ జనరేటర్, లేపాక్షి, షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా రాంభగీచా కాటేజీల వరకు క్యూలైన్లలో దర్శనం కోసం భక్తులు బారులుతీరారు. వీరికి 22 గంటల తర్వాత దర్శనం లభిస్తున్నట్టు టీటీడీ (TTD) ప్రకటించింది.