నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ

ABN , First Publish Date - 2022-05-24T15:33:05+05:30 IST

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఉదయ 9 గంటలకు ఆగస్టుకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేశారు.

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ

తిరుమల : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఉదయ 9 గంటలకు ఆగస్టుకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేశారు. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు జులై, ఆగస్టుకు సంబంధించి పలు సేవా టికెట్లను  విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవా టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ భక్తుల నమోదుకు అవకాశం ఉంది. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్‌ డిప్‌ ద్వారా టికెట్లను టీటీడీ కేటాయించనుంది.Read more