వారాంతాల్లో శ్రీవారి దర్శనానికి అధిక సమయం: TTD EO

ABN , First Publish Date - 2022-06-10T18:11:17+05:30 IST

వారాంతాల్లో శ్రీవారి దర్శనానికి అధిక సమయం కేటాయించనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

వారాంతాల్లో శ్రీవారి దర్శనానికి అధిక సమయం: TTD EO

తిరుమల: వారాంతాల్లో శ్రీవారి దర్శనానికి అధిక సమయం కేటాయించనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... శుక్ర, శని, ఆదివారాల్లో దర్శనానికి 48 గంటలు సమయం కేటాయిస్తామన్నారు. తిరుమల కొండపై గదులు దొరికే అవకాశం ఉండదని, భక్తులు ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. త్వరలోనే స్లాటడ్ సర్వదర్శనాలు పునఃప్రారంభిస్తామని చెప్పారు. ఇకపై నడకదారి భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు నిలిపివేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-10T18:11:17+05:30 IST