హెలీ టూరిజం కూడా అభివృద్ధి చేస్తాం: రోజా

ABN , First Publish Date - 2022-06-09T03:15:40+05:30 IST

రాష్ట్రంలో క్రూయిజ్‌ పర్యాటకం మొదలైందని, త్వరలో హెలీ టూరిజం కూడా అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖా మంత్రి ఆర్‌కే రోజా ప్రకటించారు.

హెలీ టూరిజం కూడా అభివృద్ధి చేస్తాం: రోజా

విశాఖపట్నం: రాష్ట్రంలో క్రూయిజ్‌ పర్యాటకం మొదలైందని, త్వరలో హెలీ టూరిజం కూడా అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖా మంత్రి ఆర్‌కే రోజా ప్రకటించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ క్రూయిజ్‌ ట్రైలర్‌ మాత్రమేనని త్వరలో పూర్తిస్థాయిలో టెర్మినల్‌ వస్తుందని, అప్పుడు అంతర్జాతీయ క్రూయిజ్‌లు వస్తాయని వివరించారు. నౌకలో మహిళలకు రక్షణ, వైద్యం వంటి ఏర్పాట్లు బాగున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేసినోలకు అనుమతి లేదు కాబట్టి, ఈ నౌక సముద్రంలో అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లిన తరువాత మాత్రమే కేసినోలు తెరుస్తారని వివరించారు. ఈ క్రూయిజ్‌ నౌక రాక గురించి ఏపీటీడీసీకి సమాచారం లేదనే విషయం తనకు తెలియదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రుషికొండపై పర్యాటక అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, ప్రతి దానిపై కోర్టులకు వెళ్లి కేసులు వేస్తున్నాయని రోజా ఆరోపించారు.

Updated Date - 2022-06-09T03:15:40+05:30 IST