చిరిగిన బ్యాగులు... చాలని బూట్లు

ABN , First Publish Date - 2022-12-31T04:52:18+05:30 IST

జగనన్న విద్యాకానుకలో భాగంగా బడి పిల్లలకు ఇచ్చిన బ్యాగులు చాలావరకు చిరిగిపోయాయని, వాటిస్థానంలో కొత్తవి కూడా పంపిణీ చేయలేదని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ గుర్తించింది.

చిరిగిన బ్యాగులు... చాలని బూట్లు

విద్యాకానుకపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): జగనన్న విద్యాకానుకలో భాగంగా బడి పిల్లలకు ఇచ్చిన బ్యాగులు చాలావరకు చిరిగిపోయాయని, వాటిస్థానంలో కొత్తవి కూడా పంపిణీ చేయలేదని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ గుర్తించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 57 పాఠశాలల్లో విద్యాకానుక, 54 పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద పథకాల అమలుపై తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో బ్యాగుల నాణ్యత బాగోలేదని తేలింది. విద్యార్థులకు రెండు జతల యూనిఫాం మాత్రమే పంపిణీ చేశారని, కొన్నిచోట్ల వస్త్రం సరిపోలేదని, కొన్నిచోట్ల ఇప్పటికీ కుట్టు కూలీ ఇవ్వలేదని, ఇచ్చినచోట్ల కూలీ సరిపోవడం లేదని తెలిపింది. సైజులు సరిపోవడం లేదనే కారణంతో పలుచోట్ల బూట్లు పంపిణీ చేయలేదని, వాటి నాణ్యత కూడా నాసిరకంగా ఉందని వివరించింది.

Updated Date - 2022-12-31T04:52:20+05:30 IST