నాడు తెలుగు తల్లికి... నేడు తెలంగాణ తల్లికి కేసీఆర్‌ ద్రోహం

ABN , First Publish Date - 2022-10-07T08:46:21+05:30 IST

నాడు తెలుగు తల్లికి... నేడు తెలంగాణ తల్లికి కేసీఆర్‌ ద్రోహం

నాడు తెలుగు తల్లికి... నేడు తెలంగాణ తల్లికి కేసీఆర్‌ ద్రోహం

ప్రాంతానికో తల్లిని సృష్టించే విషనాగు: రమేశ్‌ నాయుడు

బెంగళూరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సెంటిమెంట్‌తో తెలుగు తల్లికి ద్రోహం చేసిన కేసీఆర్‌, ఇప్పుడు పార్టీ పేరు మార్చేసి తెలంగాణ తల్లికీ తీరని ద్రోహం చేశారని బీజేపీ వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి నాగోతు రమేశ్‌ నాయుడు బెంగళూరులో గురువారం మీడియాతో మాట్లాడారు. సుభిక్షంగా ఉన్న తెలుగుతల్లిని రెండుగా విభజించి, తెలంగాణ తల్లే తమ సర్వస్వమని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, భారతీయ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు తనకు ఏ తల్లి ఆదర్శప్రాయమో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రాంతానికో తల్లిని సృష్టించే విషనాగు కేసీఆర్‌ నిజస్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. ఇలాంటి నేత జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వచ్చినా ఒరిగేదేమీ లేదని అన్నారు. అమరావతికి బీజేపీ శ్రీరామరక్షగా ఉంటుందని, బీజేపీ అండగా ఉన్నంత కాలం అమరావతిని ఎవరూ ఏమీ చేయలేరని రమేశ్‌ నాయుడు వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-10-07T08:46:21+05:30 IST