నేడు హోంగార్డుల చలో ఢిల్లీ

ABN , First Publish Date - 2022-09-11T09:22:36+05:30 IST

తమను పర్మినెంట్‌ చేయాలనే డిమాండ్‌ సాధనకు హోంగార్డులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు.

నేడు హోంగార్డుల చలో ఢిల్లీ

గుంటూరు, సెప్టెంబరు 10 : తమను పర్మినెంట్‌ చేయాలనే డిమాండ్‌ సాధనకు హోంగార్డులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఈనెల 11, 12, 13 తేదీల్లో దేశ రాజధానిలో వివిధ రూపాల్లో నిరసనలు నిర్వహించాలని నిర్ణయించారు. ముందే చలో ఢిల్లీ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అణిచివేత ధోరణి అవలంబిస్తుందనే ఉద్దేశంతో హోంగార్డులు ఒక్కరోజు ముందు ఛలో ఢిల్లీ ప్రకటనను బహిర్గతం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటిలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ తదితర నిఘా వర్గాలు  హోంగార్డులను కట్టడి చేసేందుకు చర్యలు ప్రారంభించారు.

Read more