కొవ్వూరమ్మకు అమరావతి రైతుల పూజలు
ABN , First Publish Date - 2022-10-17T09:26:30+05:30 IST
అమరావతి ఏకైక రాజధాని కావాలని కోరుతూ అమరావతి మహిళా రైతులు 108 బూడిద గుమ్మడికాయలు కొట్టి అమ్మవారిని వేడుకున్నారు.
108 గుమ్మడికాయలు నివేదన
నేడు గామన్ బ్రిడ్జి మీదుగా యాత్ర
కొవ్వూరు, అక్టోబరు 16: అమరావతి ఏకైక రాజధాని కావాలని కోరుతూ అమరావతి మహిళా రైతులు 108 బూడిద గుమ్మడికాయలు కొట్టి అమ్మవారిని వేడుకున్నారు. ఆదివారం పాదయాత్రకు విరామం కావడంతో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో గోదావరి గట్టుపై కొలువైన గ్రామదేవత కొవ్వూరమ్మ ఆలయం వద్ద వారు ప్రత్యేక పూజలు చేశారు.