అదుపుతప్పి ఇన్నోవా వాహనం బోల్తా..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-07-24T13:04:45+05:30 IST

తిరుపతి జాతీయ రహదారి(National Highway) చౌటపల్లి వద్ద రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. అదుపుతప్పి ఇనోవా

అదుపుతప్పి ఇన్నోవా వాహనం బోల్తా..ఇద్దరు మృతి

చిత్తూరు: తిరుపతి జాతీయ రహదారి(National Highway) చౌటపల్లి వద్ద రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. అదుపుతప్పి ఇనోవా వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు ముల్బాగల్‎కు చెందిన కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more