Tirupati: వైకుంఠపురం సమీపంలో విషాదం
ABN , First Publish Date - 2022-06-15T20:56:10+05:30 IST
వైకుంఠపురం సమీపంలో విషాదం చోటుచేసుకుంది. మ్యాన్‌హోల్‌లో ఇద్దరు మున్సిపల్ కార్మికులు పడ్డారు.

తిరుపతి: వైకుంఠపురం సమీపంలో విషాదం చోటుచేసుకుంది. మ్యాన్‌హోల్‌లో ఇద్దరు మున్సిపల్ కార్మికులు పడ్డారు. ఈ ఇద్దరిలో ఆర్ముగం అనే కార్మికుడు మృతి చెందాడు. మహేష్ అనే మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. మహేష్‌కు రుయాలో చికిత్స అందిస్తున్నారు. మృతుడు పుత్తూరు జిల్లా నారాయణపురం వాసిగా గుర్తించారు. మృతుడి కుటుంబానికి మేయర్ శిరీష రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అయితే ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ అనుపమ అంజలి సీరియస్ అయ్యారు. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.