తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-12-31T07:49:24+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు 26 కంపార్ట్మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు 26 కంపార్ట్మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 63,253 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.5.16 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 24,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.