భారీగా శ్రీవారి హుండీ ఆదాయం
ABN , First Publish Date - 2022-05-27T01:52:41+05:30 IST
తిరుమల శ్రీవారికి మరోసారి హుండీ ఆదాయం భారీగా లభించింది. మంగళవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన

తిరుమల: శ్రీవారికి మరోసారి హుండీ ఆదాయం భారీగా లభించింది. మంగళవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా.. రూ.5.43 కోట్లు లభించినట్టు టీటీడీ గురువారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. కరోనా తర్వాత అత్యధికంగా లభించిన హుండీ ఆదాయం ఇదే కావడం గమనార్హం. హుండీ కానుకలతో పాటు నాలుగైదు రోజులుగా నిల్వ ఉన్న చిల్లర నాణేల లెక్కింపును కూడా జత చేయడంతో ఈ మేరకు ఆదాయం సమకూరినట్టు తెలుస్తోంది.