Tirumalaలో మంత్రి రోజా ఎస్కార్ట్ డ్రైవర్ నిర్వాకం
ABN , First Publish Date - 2022-06-11T13:31:28+05:30 IST
తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో మరోసారి నిఘా వైఫల్యం బట్టబయలైంది.

తిరుమల: తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో మరోసారి నిఘా వైఫల్యం బట్టబయలైంది. నిన్న ప్రముఖ నటి నయనతార(Nayanatara) చెప్పులు వేసుకుని మాడవీధుల్లో తిరిగిన ఘటన మరువక ముందే ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు. సదరు వ్యక్తి మంత్రి రోజా ఎస్కార్డ్ డ్రైవర్గా టీటీడీ సిబ్బంది గుర్తించింది. సంప్రదాయ దుస్తులు లేకుండా మహాద్వారం నుంచి ఆలయంలోకి రోజా ఎస్కార్ట్ డ్రైవర్ ప్రవేశించాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన టీటీడీ సిబ్బంది..డ్రైవర్ను పడికావలి నుంచి వెనక్కి పంపించివేశారు. డ్రైవర్ను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.