పాపం పసివాళ్లు..!

ABN , First Publish Date - 2022-03-16T08:58:17+05:30 IST

ద్విచక్రవాహనాన్ని స్కూలుబస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందగా.. బండి నడుపుతున్న యవకుడు, మరో చిన్నారి గాయాల పాలయ్యారు. విజయనగరం జిల్లా

పాపం పసివాళ్లు..!

మృత్యువులా ఎదురొచ్చిన స్కూల్‌ బస్సు

ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో 

అక్కడికక్కడే ముగ్గురు చిన్నారులు మృతి

టెక్కలివలస వద్ద ప్రమాదం 


తెర్లాం, మార్చి 15: ద్విచక్రవాహనాన్ని స్కూలుబస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందగా.. బండి నడుపుతున్న యవకుడు, మరో చిన్నారి గాయాల పాలయ్యారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం టెక్కలివలస వద్ద మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తెర్లాం మండలం పెరుమాలికి చెందిన మైలపల్లి మురళి మంగళవారం సాయంత్రం తన ఇద్దరు కుమారులు, ఇద్దరు మేనళ్లుళ్లతో ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరుగుతున్న పోలిపల్లి అమ్మవారి జాతరకు బయలుదేరాడు. తెర్లాం మండలం టెక్కలివలస వద్దకు రాగానే.. రాజాంకు చెందిన ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు తన ముందున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేస్తూ మురళి టూవీలర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మురళి తీవ్రంగా గాయపడగా ఇద్దరు కుమారులు మైలపల్లి సిద్ధు (10) హర్ష (8), మేనల్లుడు ఒడ్డి రిషికుమార్‌ (8) అక్కడికక్కడే మృతి చెందారు. మరో మేనల్లుడు బలగ సంతోశ్‌కుమార్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మురళి పరిస్థితి విషమంగా ఉండడంతో రాజాంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు.  మురళి భార్య కుమారుల మృతి వార్త విని కుప్పకూలిపోయింది. గ్రామస్థులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  తెర్లాం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more