ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. తల్లీబిడ్డలు క్షేమం

ABN , First Publish Date - 2022-07-07T08:37:45+05:30 IST

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. తల్లీబిడ్డలు క్షేమం

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. తల్లీబిడ్డలు క్షేమం

మహారాణిపేట (విశాఖపట్నం), జూలై 6: ప్రసవం కోసం కేజీహెచ్‌లో చేరిన మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం ప్రాంతానికి చెందిన బి.పైడిరాజు ప్రసవం కోసం కేజీహెచ్‌లో చేరారు. బుధవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. వీరిలో ఇద్దరు ఆడ శిశువులు, ఒకరు మగబిడ్డ. తల్లితో సహా ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా, పైడిరాజుకు ఇది రెండో కాన్పు. మొదటి కాన్పులో ఆడ పిల్లకు జన్మనిచ్చింది. పైడిరాజు బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా, ఆమె భర్త లక్ష్మణనాయుడు విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు.

Updated Date - 2022-07-07T08:37:45+05:30 IST