‘బాదుడే బాదుడు’కు వచ్చినవారిని చితక్కొట్టాలి
ABN , First Publish Date - 2022-08-04T09:06:09+05:30 IST
‘బాదుడే బాదుడు’కు వచ్చినవారిని చితక్కొట్టాలి
ధర్మాన కృష్ణదాస్ ఫైర్
నరసన్నపేట, ఆగస్టు 3: ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం పేరిట గ్రామాల్లోకి వచ్చినవారిని చితక్కొట్టాలని మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలనలో ఏమీ చేయలేదని బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో వారు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అమరావతి నిర్మాణంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు తప్ప.. అభివృద్ధి లేదు’ అని ఆరోపించారు.