బీజేపీ పాలనలో మహిళకు రక్షణ ఏదీ?

ABN , First Publish Date - 2022-09-25T09:45:33+05:30 IST

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మిరియం దావెలె విమర్శించారు. శనివారం నెల్లూరులోని నర్తకి సెంటర్‌లో జరిగిన ఐద్వా రాష్ట్ర మహాసభలో

బీజేపీ పాలనలో మహిళకు రక్షణ ఏదీ?

ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మిరియం దావెలె


నెల్లూరు(వైద్యం)సెప్టెంబరు 24 : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మిరియం దావెలె విమర్శించారు. శనివారం నెల్లూరులోని నర్తకి సెంటర్‌లో జరిగిన ఐద్వా రాష్ట్ర మహాసభలో ఆమె ప్రసంగించారు. ప్రధాని మోదీ బేటీ బచావో బేటీ పడావో అంటారని ఎక్కడ బేటీ బచావో, పడావో ఉందని ప్రశ్నించారు. గుజరాత్‌లో అత్యాచార నిందితులను ప్రభుత్వం విడుదల చేయడంపై సుప్రీం కోర్డులో ఐద్వా కేసు వేసిందని, బాధిత మహిళల పక్షాన పోరాడతామని అన్నారు. ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మద్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చారని నేడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని కోరుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు.

Read more