నంద్యాలలో ఒకే రోజు మూడు ఆలయాల్లో చోరీ

ABN , First Publish Date - 2022-04-29T14:08:13+05:30 IST

జిల్లాలోని బేతంచెర్ల మండలంలో దుండగులు రెచ్చిపోయారు. ఒక్క రోజే మూడు ఆలయాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు.

నంద్యాలలో ఒకే రోజు మూడు ఆలయాల్లో చోరీ

నంద్యాల: జిల్లాలోని బేతంచెర్ల మండలంలో దుండగులు రెచ్చిపోయారు. ఒక్క రోజే మూడు ఆలయాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బేతంచర్ల శివారులోని ఆంజనేయ స్వామి గుడి, గోరు మానుకొండ హనుమ ఆంజనేయస్వామి ఆలయం, సిమెంట్ నగర్‌లోని సుంకులమ్మ గుడిలో దొంగలు హుండీలను ధ్వంసం చేసి నగదును అపహరించారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా... ఒకే వ్యక్తి 3 ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. 

Updated Date - 2022-04-29T14:08:13+05:30 IST