మూడో ఆప్షన్‌ ఇళ్ల నిర్మాణానికి చర్యలు

ABN , First Publish Date - 2022-08-04T07:57:26+05:30 IST

మూడో ఆప్షన్‌ ఇళ్ల నిర్మాణానికి చర్యలు

మూడో ఆప్షన్‌ ఇళ్ల నిర్మాణానికి చర్యలు

గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 

అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): పేదలందరికీ ఇళ్ల పథకంలో మూడో ఆప్షన్‌ కింద ఎంపిక చేసిన ఇళ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన గృహనిర్మాణశాఖ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మూడో ఆప్షన్‌ ఎంపిక చేసుకున్న లబ్ధిదారులు, కాంట్రాక్టర్ల మ్యాపింగ్‌, అవగాహన ఒప్పందాలు, బ్యాంక్‌ ఖాతాల ప్రారంభం, లబ్ధిదారులతో స్వయం సహాయక గ్రూపుల ద్వారా రుణాలు ఇప్పించడం తదితర పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. 

Updated Date - 2022-08-04T07:57:26+05:30 IST